గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా గురువారెడ్డి ప్రమాణ స్వీకారం

ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డివారి గురువారెడ్డి ప్రమాణ స్వీకారం శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, గురువారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి ఇంచార్జ్ సుగుణమ్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్