దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా హేమంత్ రాయల్ నియామకం: ఎమ్మెల్యే బొజ్జల కృతజ్ఞతలు

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, శ్రీ దుర్గమ్మ కొండ ఆలయం నూతన చైర్మన్‌గా నియమితులైన హేమంత్ రాయల్ తెలిపారు. యువతను ప్రోత్సహించే నాయకుడిగా ఎమ్మెల్యేకు మంచి పేరుందని, ఆ నమ్మకానికి తగిన విధంగా దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మనసా– వాచా – కర్మణా శుద్ధి తో విధులు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అంకితభావంతో పనిచేస్తానని హేమంత్ రాయల్ స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి, ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి కి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్