శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు.