అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు, సిఐటియు ధర్నా

దేశంలోని కార్మిక వర్గ ప్రయోజనాలను, హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయడాన్ని ఐఎఫ్టియు, సిఐటియు నేతలు దుర్మార్గమని మండిపడ్డారు. ఏప్రిల్ 1 నుంచి దేశంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ప్రాజెక్టు కార్యదర్శి స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్