తమిళనాడు ఎన్నికల్లో I. N. D. I. A కూటమి దే విజయం

పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూర్ జిల్లా, పొన్నేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరై చంద్రశేఖర్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలగురవం బాబు మాట్లాడుతూ, తమిళనాడులో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో I. N. D. I. A కూటమిదే విజయమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, రాబోవు రోజుల్లో తమిళనాడుతో పాటు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదరం రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్