పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు నేతృత్వంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడులోని పొన్నేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దొరై చంద్రశేఖర్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలగురవం మాట్లాడుతూ, తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో I. N. D. I. A కూటమి విజయం సాధిస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని, రాబోయే రోజుల్లో తమిళనాడుతో పాటు భారతదేశంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదరం రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.