శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో సోలార్ పరికరాల నాణ్యతను పరిశీలించేందుకు సీఎండీ శివశంకర్ లోతేటి రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ను సందర్శించారు. సోలార్ ప్యానెల్స్, స్ట్రక్చర్లు తదితర పరికరాలను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 5 నుంచి 14 వరకు "సోలార్ ఉత్సవం" జరగనుందని, ఏప్రిల్ 14లోగా 25వేల గృహాలకు రూఫప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.