IITలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు వద్ద ఉన్న ఐఐటీ తిరుపతిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు ఏప్రిల్ 1, 2 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం తెలిపింది. నైట్ డ్యూటీ డాక్టర్స్ (2), నర్సింగ్ ప్రాక్టీషనర్ (2), నర్సింగ్ అసిస్టెంట్ (01), అంబులెన్స్ డ్రైవర్ (03), కార్ డ్రైవర్ (01) మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాల కోసం https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్