భువన కార్మికులకు అండగా జనసేన పార్టీ: కొట్టే సాయి ప్రసాద్

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ, కార్మికుల కష్టాలకు స్పందించే పార్టీ జనసేన పార్టీ అని, పేదవాడి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. 2020లో ఇసుక కొరతతో 32 మంది కార్మికులు మరణించినప్పుడు వారికి అండగా నిలిచిన పార్టీ జనసేన పార్టీ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, నవీన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్