శ్రీకాళహస్తిలో విలేకరిపై జరిగిన దాడిని నిరసిస్తూ, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగి, వాస్తవాలు రాస్తే దాడులు చేయడం సరికాదని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మీడియా రంగంలో ఆందోళన రేకెత్తించింది.