శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను స్వయంగా కలిసి, తాగునీరు, రేషన్ కార్డులు, రహదారుల వంటి సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.