సత్యవేడు వరదయ్య పాలెం మండలం యానాదివెట్టు గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.