అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి, మన్యం గడ్డపై స్వేచ్ఛా గీతం ఆలపించిన అల్లూరి గారి త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయం అని, వారి పోరాట పటిమ, అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని ఎమ్మెల్యే అన్నారు. మాతృభూమి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్