నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కుటుంబంతో ఆదివారం కలిసి శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఎంపీ కుటుంబం ప్రత్యేకంగా రాహు కేతు పూజలు చేశారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆశీర్వచనం పొందారు.