తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జూలై 1వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించబోయే 'టిడిపి క్యాడర్ మీటింగ్' కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పనులను పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ పరిధిలోని కొత్తపాళెం గ్రామం వద్ద భారీ బహిరంగ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.