శ్రీకాళహస్తి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి దసరాదాచారి మాట్లాడుతూ, అరాచక సామ్రాట్ జగన్ రెడ్డిని గద్దె దించి, ప్రజా ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను వేద వాక్కులా భావించి, వాటిని అమలు చేయడానికి అహర్నిశలూ చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ళలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ రావు, వజ్రం కిషోర్ పాల్గొన్నారు.