ఎన్టీఆర్ జయంతి వేడుకలు

శ్రీకాళహస్తి మండలం క్లస్టర్ వన్ లో వైష్ణవి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజు కార్యక్రమం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆదేశానుసారం, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు నందమూరి తారక రామారావు ఆద్యుడని, దేశ చరిత్రలోనే పేదల కోసం ఆయన పుట్టారని అన్నారు.

సంబంధిత పోస్ట్