ఇంటింటికి పెన్షన్లు పంపిణీ; ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, మెర్లపాక SC కాలనీలో పేదలసేవలో భాగంగా NTR భరోసా పెన్షన్ పంపిణీ చేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే ప్రతి నెలా ఒకటవ తేదీన పెన్షన్ డబ్బులు పంపిణీ చేసి ఆదుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఆగిపోయినా, ప్రతి నెలా ఒకటవ తేదీన వచ్చే పెన్షన్ మాత్రం ఆగదనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్