తిరుపతి జిల్లా రేణిగుంటలోని తారకరామ నగర్‌లో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, డి.ఎస్.పి శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్, 250 మంది పోలీసులతో ఈ తనిఖీలు జరిగాయి. రికార్డులు లేని 169 బైకులు, 20 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించామని, ప్రజలు దీనిని సానుకూలంగా స్వీకరించాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. ఈ ఆపరేషన్‌లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.