పార్టీకి కష్టపడిన కార్యకర్తలకే పదవులు... కోలా ఆనంద్

భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి సూచనల మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోలా ఆనంద్ గారి సిఫార్సుతో అమ్మపాలెం రమణారెడ్డిని రాష్ట్ర సభ్యులుగా నియమించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో రమణారెడ్డిని కోలా ఆనంద్ గారు శేషవస్త్రం, పూలమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేలగల సుబ్రహ్మణ్యం, లోకేష్ యాదవ్, వాసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్