కాశీ విశ్వేశ్వరుడికి ప్రదోషకాల పూజలు

శ్రీకాళహస్తిలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి నందీశ్వరుడికి, మూలవిరాట్లకు పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి గర్భాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, నందీశ్వరునికి, శివుడికి ఏకకాలంలో హారతులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్