శ్రీకాళహస్తి–పిచ్చాటూరు మార్గంలో గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మారప్పరెడ్డి కండ్రిగ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో అనుమానాస్పద కారును ఆపి పరిశీలించగా, అందులో 6 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ ఘటనలో తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు.