ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేణిగుంట ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పరిధిలోని సర్వే నంబర్ 1129 లో 5.14 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత భూమి చుట్టూ అక్రమంగా నిర్మించిన ఫెన్సింగ్ ను శనివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. తహశీల్దార్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూముల జోలికొస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.