మంగళవారం ఏర్పేడు మండలంలోని చిందేపల్లి గిరిజన కాలనీలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటూ అదుపుతప్పి నీటిగుంటలో పడి మృతి చెందింది. నెల్లూరు జిల్లా సౌత్ అమలూరు, ఏకే నగర్కు చెందిన శంకరయ్య, విజయ దంపతులు జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చిందేపల్లికి వచ్చారు. శంకరయ్య అక్కడ వాచ్మెన్గా పనిచేస్తూ ఎస్టీ కాలనీలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం, నారాయణ రెండో తరగతి, సుస్మిత ఒకటో తరగతి చదువుతున్నారు. ఈ విషాద సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.