హజరత్ దర్గాలో ఎస్పీ సుబ్రమణ్యం

శ్రీకాళహస్తిలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హజరత్ జిమ్లే షాపీర్ దర్గాను తిరుపతి పోలీస్ ట్రైనింగ్ ఎస్పీ సుబ్రహ్మణ్యం సందర్శించారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్‌లు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్పీ సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాదర్‌ను సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్