శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తికి విశేష అభిషేకం జరిగింది. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యావచనం, కలశానికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం, గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.