శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు 'హరితోదయం' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా, ప్రతి నెలా నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లను సంరక్షించడం, నీటిని పొదుపుగా వాడడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, డస్ట్ బిన్స్ వాడకాన్ని అలవాటు చేసుకోవడం వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.