శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని బండివానిపల్లి గ్రామంలో రైతులు గుండాల సుబ్బరామయ్య, దార పెంచలయ్య, పొన్నయ్యల పొలాల నుంచి ఐదు మోటర్లకు చెందిన కేబుల్, కరెంట్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీనిపై బాధితులు ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.