తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయితీలోని కుర్ర కాలువ పద్మానగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో మరణించడంతో వారికి దహన క్రియలకు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆదేశాల మేరకు ఆదివారం బిజెపి యువ నాయకులు వేణు ముదిరాజ్ ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షుడు రాజారాయుల్ పాల్గొన్నారు.