శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డారు. చెన్నైలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసులో, మృతుడి కుడి చేయి మీద 'వినూత' అని టాటూ ఉండటమే పోలీసుల దృష్టిని వినుతకోట దంపతులపైకి మళ్లించింది. ఈ ఆధారంతో దర్యాప్తును వేగవంతం చేసిన చెన్నై పోలీసులు, వినుత కోటతో పాటు ఆమె భర్త చంద్రబాబును అదుపులోకి తీసుకొని విచారించారు.