శ్రీకాళహస్తి: క్రోమో మెడికేర్ కంపెనీలో పేలిన రియాక్టర్

రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో గల క్రోమో మెడికేర్ కంపెనీలో సోమవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. ఘటనా స్థలానికి శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది చేరుకొని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్