శ్రీకాళహస్తి ఆలయంలో రాహు, కేతు పూజల కోసం వచ్చే భక్తులను టార్గెట్ చేస్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ‘జాతక దోషాలున్నాయి, డబ్బులు పంపితే పూజలు చేయిస్తాం’ అంటూ ఫోన్ చేస్తుండటం గమనార్హం. భక్తుల వివరాలు సేకరించి, వారి పేర్లతో పూజలు చేస్తామంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మోసాలకు ఎవరూ గురికాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.