శ్రీకాళహస్తి: వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం

తొట్టంబేడు మండలంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాళహస్తి–కాళంగి ప్రధాన రహదారి మార్గంలో చిట్టత్తూరు, కారాకొల్లు కాజ్‌వేలు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. కారాకొల్లు కాజ్‌వేపై నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాజ్‌వేలు దాటే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్