ఏర్పేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు నిండిపోయాయి. ఇసుక తాగేలి పంచాయతీ చెరువులో నీటి నిల్వ పెరిగి, కలుజు వద్ద గండి పడింది. ఈ గండి ద్వారా చెరువులోని నీరంతా బయటకు ప్రవహిస్తోంది. చెరువు కింద ఉన్న సుమారు 100 ఎకరాల సాగుభూముల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.