శ్రీకాళహస్తి మండలంలోని ఊరందురు వద్ద శుక్రవారం రాత్రి ఫ్లై ఓవర్ పై కావలి నుంచి త్రిశూర్ వెళ్తున్న చేపల లోడ్ వ్యాన్ టైర్ బ్లాస్ట్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు.