ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో బాల్య వివాహాలను నిరోధించేందుకు అంగన్వాడీ టీచర్లు, మహిళలతో అవగాహన సదస్సు జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ హరిత మాట్లాడుతూ, 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలుడి వివాహం బాల్య వివాహమని, శివరాత్రి సమయంలో ఇలాంటివి జరిగే ప్రమాదం ఉందని, అవగాహన కల్పించాలని సూచించారు. ప్రగతి కన్వీనర్ చంద్రశేఖర్ చట్టంతో పాటు సమాజ దృక్పథం మారాలని, బాలికలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, పిల్లలకు సంఘాల ద్వారా అవగాహన పెంచాలని, తప్పనిసరిగా చదివించాలని కోరారు. పేదరికం, సాంప్రదాయాలు, నిరక్షరాస్యత వంటివి బాల్య వివాహాలకు కారణాలని వివరించారు.