ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధాకర్, టోర్నమెంట్ ప్రకటన

తిరుపతి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా విశ్రాంత పీడీ డాక్టర్ సుధాకర్, మెంబర్‌గా మునిరత్నం బాబు నియమితులయ్యారు. జిల్లాలో ఫుట్‌బాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకువచ్చి యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు రేణిగుంట రైల్వే ఇన్‌స్టిట్యూట్ మైదానంలో 'సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్' నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఫుట్‌బాల్ జట్లు, క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొని విజయవంతం చేయాలని మునిరత్నం బాబు కోరారు.

సంబంధిత పోస్ట్