పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ధ్యేయంగా సేవ చేయాలన్న రాజకీయం అనే సూత్రం ఆధారంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ, ప్రతీ మహానాడు నుండి నూతనోత్తేజంతో పేదల సేవకు పునరంకితం అవుతోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు కొనియాడారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడు 2026ను అందరి ఆమోదంతో హైబ్రిడ్ విధానంలోకి మార్చుకొని ఘనంగా నిర్వహించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి పురి దసరాతాచారి, ఉమేష్ రావు, వజ్రం కిషోర్ పాల్గొన్నారు.