శ్రీకాళహస్తి ఏర్పేడు హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు "బడి పిలుస్తుంది రా" అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దిందని, కావున ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.