ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా జరుగుతున్న 'పల్స్ పోలియో' ఉచిత చుక్కల మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా, బహుదూర్ పేట, 8వ వార్డు నందు ఏర్పాటుచేసిన పోలియో కేంద్రానికి వెళ్లి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి విచ్చేసిన పలువురు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేసి, తల్లులకు అవగాహన కల్పించారు.