శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో గల చేమూరు గ్రామం, చేమూరు హరిజనవాడ, పెనలపాడు గ్రామాలలో పాండురంగ స్వామి అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు అధ్యక్షులు మునిరాజు నాయుడు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి మేనమామ తులసి రాము, నాయకులు కమల్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.