తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తోట్టంబేడు మండలం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, తొట్టంబేడు మండల కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఏట అడుగుపెట్టడం గర్వకారణమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాము, తమ నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్