మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి భవన నిర్మాణ కార్మికులను సన్మానించి, వారికి దుస్తులను ప్రధానం చేసి, మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా జీవించడానికి, వారి అవసరాలు తీరడానికి కార్మికుల కష్టాలే కారణమని, కార్మికులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండలం అధ్యక్షులు రాహుల్ రాయల్, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.