ముత్యాలమ్మ ఆలయంలో శేష పాన్పు ముగ్గు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మ జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి శేషు పాన్పు ముగ్గు వేసి సుందరంగా అలంకరించారు. ముత్యాలమ్మ అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో చక్కగా అలంకరించి, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం శేషు పాన్పు ముగ్గు వద్ద ప్రత్యేక పూజలు చేసి, దీపదోప నైవేద్యం, కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీవో కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు గుర్రపు శెట్టి మరియు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్