తమిళనాడులోని టెంకాసిలో మార్చి 27 నుంచి 29 వరకు జరిగిన 44వ సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన డిష్మిత, పద్మప్రియ ఏపీ మహిళా జట్టు తరఫున పాల్గొని ట్రోఫీ సాధించారు. ప్రిన్సిపల్ రాజశేఖర్, పీడీ నరసింహారావు విద్యార్థినులను అభినందించారు.