టీడీపీ రాష్ట్ర తెలుగు యువత మీడియా కో-ఆర్డినేటర్ కె. వి. ప్రతాప్, మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిరాశపరిచిందని, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని తెలిపారు.