శ్రీకాళహస్తిలో దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా, ఈనెల 15వ తేదీన రాజీవ్ నగర్ లో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద పూర్తయిన 1640 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. దివంగత మంత్రి గోపాలకృష్ణారెడ్డి నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టిందని, అమరావతికి పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి ముందుంటారని ఆయన పేర్కొన్నారు.