సగం ధరలకే ట్రాక్టర్లు..

శ్రీకాళహస్తి వ్యవసాయ అధికారి రమేశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను అందించనుంది. SC, ST, మహిళా, సన్నకారు రైతులకు 50% సబ్సిడీ లభిస్తుంది, మిగిలిన రైతులకు 40% సబ్సిడీ వర్తిస్తుంది. ఆసక్తిగల రైతులు మే 19 లోపు రైతు సేవా కేంద్రం https://eeseed.ap.gov.in/FM/ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 19 లోపు దరఖాస్తు చేసుకున్న రైతులకు మే 23-25 తేదీల్లో లాటరీ తీస్తారు. జూన్ 9 లోగా రైతులు తమ వాటాను చెల్లిస్తే, వెంటనే యంత్రాలు అందజేయబడతాయి.

సంబంధిత పోస్ట్