ముక్కంటి సన్నిధిలో టీటీడీ బోర్డు మెంబర్

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు సభ్యుడు సౌరబ్ బోరా తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తికి విచ్చేసి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి, ఆలయ విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ శ్రీ బీకే వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సీ. నాగభూషణం, ఏపీఆర్ఓ శ్రీ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్