ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గవ్యాప్తంగా జరుగుతున్న 'పల్స్ పోలియో' ఉచిత చుక్కల మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా, శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సచివాలయం నందు ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఎమ్మెల్యే స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రానికి విచ్చేసిన పలువురు చిన్నారులకు ఆయన చేతుల మీదుగా పోలియో చుక్కలు వేసి, తల్లులకు అవగాహన కల్పించారు.